![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -274 లో.....ఆ రామరాజు కుటుంబంపై పగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు.. నాకూ వదిలెయ్యండి అని సేనాపతితో విశ్వ అంటాడు. మరొకవైపు ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. ఫీల్ మై లవ్ అనీ సాంగ్ పాడుతుంది. నాకు నువ్వు కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఎందుకు చెప్పలేదని ప్రేమని నర్మద అడుగుతుంది. ఇద్దరం ఒకరికొకరు అన్ని చెప్పుకోవాలనుకున్నాం కదా అని నర్మద అంటుంది.
నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పలేదని ప్రేమ అంటుంది. నీ గురించి ధీరజ్ మాట్లాడిన తీరు నాకూ బాగా నచ్చింది. తనకి ఇప్పుడే నీపై ప్రేమ మొదలైంది. ఎప్పుడు అలాగే ప్రేమగా ఉండండి అని నర్మద చెప్తుంది.ఆ తర్వాత అసలు ఎదురింటి వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిందని శ్రీవల్లి దగ్గరికి నర్మద వెళ్తుంది. నువ్వే కదా ఈ ఇంట్లో జరిగేది ఆ ఇంట్లో చెప్తున్నావని నర్మద అడుగుతుంది. నేనేం చెప్పట్లేదని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ప్రేమ బట్టలు పిండేస్తుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. హెల్ప్ చెయ్యమని ప్రేమ అడుగుతుంది. హెల్ప్ చేస్తాడు.
ధీమా అంటే ఏంటని ధీరజ్ అడుగుతాడు. నిన్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత అమూల్య దగ్గరికి శ్రీవల్లి వస్తుంది మీ బావ ఏంటి నిన్నే చూస్తున్నాడు అని విశ్వ గురించి అడుగుతుంది. అతనిపై నీ ఉద్దేశ్యం ఏంటని శ్రీవల్లి అడుగగా విశ్వని అమూల్య తిడుతుంది. అప్పుడే ఎదురుగా ప్రేమ ఉంటుంది. విన్నావా ప్రేమ వదిన.. మీ అన్నయ్య మంచోడు అని చెప్తుందని ప్రేమతో అమూల్య అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అమూల్య కాలేజీకి వెళ్తుంది. శ్రీవల్లి వంక నర్మద కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |